NTV Telugu Site icon

Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే..!

Untitled Design

Untitled Design

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం స్టార్ గా ఎదగడం చకాచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగచైతన్య, అఖిల్ అరగేట్రం చేసారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో దగ్గుబాటి వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తు  ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్న తారకరామతేజ, ఈ యంగ్ లయన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురు చూస్తున్నారు…

కాగా గత నాలుగైదు ఏళ్లుగా నందమూరి వారసుడి ఏంట్రీపై పలు వార్తలు వినవచ్చాయి. ఆ డైరక్టర్ దర్శకత్వంలో  ఈ నిర్మాత లాంఛ్ చేయబోతున్నాడు అంటూ రకరకాలుగా వినిపించింది. కాని అవేవి కార్యరూపం దాల్చలేదు. ఏడాదికేడాది మోక్షు ఎంట్రీ పై ఊహగానాలు వినిపించాయి. కాని అవేవి వాస్తవంలోకి రాలేదు. ఇదిలా ఉండగా గత  ఏళ్లుగా ఈ కుర్ర హీరో అన్నిరకాల విద్యలో శిక్షణ తీసుకొంటున్నాడు. అటు డాన్స్, ఇటు ఫైట్స్, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ తో పాటు ప్రముఖ గురువుల వద్ద యాక్టింగ్ కోచింగ్ లో నైపుణ్యం సాధించే పనిలో ఉన్నాడు.

కాగా మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. బరువు తగ్గి లుక్స్ మార్చుకొని పర్ఫేక్ట్ హీరో మెటీరియల్ కి కావలసిన క్వాలిఫికేషన్స్ సాధించాడు మోక్షు. తాజా సమాచారం మేరకు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అరంగేట్రం చేసుకుందుకు అన్ని పనులు చక చక జరుగుతున్నాయని, కథ చర్చలు ముగిశాయని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మంచి రోజు చూసి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని NBK బ్యానర్ పై బాలయ్య రెండవ కుమార్తె శ్రీమతి మతుకుమిల్లి తేజస్విని నిర్మించనున్నారు. మోక్షు ఎంట్రీ వార్తల నేపథ్యంలో ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Show comments