NTV Telugu Site icon

Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమా పూజా కార్యక్రమం వాయిదా..!

Mokshu

Mokshu

నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Pushpa 2 : అమెరికా నుండి అనకాపల్లి వరకు నీ యవ్వ తగ్గేదేలే

ఇదిలా ఉండగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ డిసెంబరు 5 అనగా ఈ రోజు నిర్వహిస్తున్నారని గత కొద్దీ రోజలుగా వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబీకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువ నేత , అలాగే ఏపీ విద్యా శాఖమంత్రి నారా లోకేష్ తదితరులు హాజరవుతారు అని కూడా వినిపించింది. కానీ నేడు జరగాల్సిన ఈ సినిమా పూజా కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తుంది. అందుకుగల కారణాలు అయితే తెలియ రాలేదు కానీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు సమాచారం అందుతోంది. మరో మంచి ముహూర్తం చూసి నిర్వహిస్తారట. ఇటీవల మోక్షజ్ఞ మరో లుక్ ను రిలీజ్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చార్మింగ్ లుక్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు. అలాగే మోక్షు సత్యనంద్ తో పాటు ఆర్పీ పట్నాయక్ వద్ద శిక్షణ పొందాడు. మరోవైపు మోక్షును వెండితెరపై చూసేందుకు నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Show comments