టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనే చెప్పాలి. అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని కొన్నేళ్లుగా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఎంట్రీ అయితే జరగలేదు. అటు బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఆ మధ్య హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు.
Also Read : Bollywood : దర్శకులతో గొడవలు.. అమీర్ ఖాన్ కు ఏమైంది ?
ఇప్పటివరకు మోక్షు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఈ ఏడాది మోక్షు ఎంట్రీ లేనట్టే. కానీ జరుగుగుతున్న పరిణామాలు నందమూరి ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనే సందేహం కూడా కలుగుతోంది. మోక్షుకి లవ్ స్టోరీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీవుందని ఆ మధ్య నారా రోహిత్ చెప్పాడు. మరోవైపు బాలయ్య డైరెక్ట్ చేయబోయే ఆదిత్య మాక్స్ ద్వారా పరిచయం చేస్తాను అన్నారు. ఫ్యాన్స్ ఏమో మాస్ కమర్షియల్ సినిమా తియ్యాలి అని ఆశిస్తున్నారు. గత నెలలో మోక్షు 31పడిలో అడుగుటపెట్టాడు. కానీ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. మరి ఎప్పడు ఆ ముహూర్తం వస్తుందో. కాస్త ఆలస్యం అయినా సరే మోక్షు ఎంట్రీ సినిమాతోనే సంచలనం సృష్టిస్తాడు అనేది యంగ్ లైన్ ని దగ్గరనుండి చుసిన వాళ్ళు చెప్పే మాట.
