నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది. ‘బీబీ3’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తెలుసుకోవడానికి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగువారు ప్రత్యేకంగా భావించే ఉగాది పర్వదినం రోజున ‘బీబీ3’ సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. చెప్పినట్టుగానే ఈ రోజు ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ ‘అఖండ’ అని టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో బాలయ్య ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. ఈ వీడియో చూస్తే బాలయ్య అభిమానులకు ఊపు రాక మానదు. మీరు కూడా ‘అఖండ’ టైటిల్ రోర్ ను వీక్షించండి.
అద్భుతంగా బీబీ3 టైటిల్ రోర్ వీడియో… ‘అఖండ’గా బాలయ్య
