Site icon NTV Telugu

Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!

Veerasimha Reddy

Veerasimha Reddy

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు సినిమా మొత్తానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అయితే, వాటిలో ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ పోషించిన పాత్రను బాలకృష్ణ పోషిస్తే అదిరిపోయేదని చాలామంది భావిస్తూ వచ్చారు.

Read More:Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు

ఇప్పుడు అలాంటి వారందరికీ ఒక శుభవార్త! జైలర్ సెకండ్ పార్ట్ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఒక అతిథి పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ విషయం దాదాపుగా ఖరారైనట్లే. నందమూరి బాలకృష్ణ రజనీకాంత్ కోసం నడిచొస్తుంటే “నా స్వామి రంగా” విజువల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read More:Venkatesh : రజినీకాంత్ చెప్పిన మాట వల్లే సక్సెస్ అయ్యా.. హీరో వెంకటేశ్

జైలర్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దానికి రెండో భాగం సీక్వెల్‌ను అప్పట్లోనే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాను నెల్సన్ తెరకెక్కించే పనిలోనే ఉన్నాడు. అనిరుద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి ఇప్పుడు బాలకృష్ణ కూడా యాడ్ కావడం అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తైన తర్వాత రిలీజ్ ప్రణాళికలను సిద్ధం చేసే అవకాశం ఉంది.

Exit mobile version