NTV Telugu Site icon

Nagavamsi : లక్కీ భాస్కర్ లో తప్పులు కనిపెడితే పార్టీ ఇస్తా..

Nagavamsi

Nagavamsi

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘లక్కీ భాస్కర్’.  దీపావళి కానుకగా ఈ నెల అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజగా హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ‘లక్కీ భాస్కర్’ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ‘నరుడి బ్రతుకు నోటుతోనే ముడిపడి ఉంటుందని, అది లేనిదే మనిషికి మర్యాద ఉండదు’ అనే కధాంశంతో వస్తోంది లక్కీ భాస్కర్.

Also Read :  Coolie : సూపర్ స్టార్ రజనీ ఈజ్ బ్యాక్…

ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. అందులో భాగంగా నిర్మాత నాగవంశీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘మ్యాడ్’ సినిమా రిలీజ్ టైమ్ లో సినిమా నచ్చలేదని చెప్తే టికెట్ డబ్బు రీఫండ్ అని స్కీం పెట్టారు. ఈ సినిమాకు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా అందుకు నిర్మాత నాగవంశీ బదులిస్తూ  ”  నాకు తెలిసి ఈ సినిమాలో తప్పులను వెతకడం కష్టం. అసలు తప్పులు అనేవి దొరకవేమో అని నమ్మకం కూడా ఉంది ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్లందర్నీ పిలిచి పార్టీ ఇచ్చి, ఫోటోలు కూడా దిగుతాను’ అని అన్నారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.

Show comments