Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నిర్వహించిన ఇటు అర్జున సినిమా సక్సెస్‌మీట్‌లో తన జడ్జిమెంట్, ట్రాక్ రికార్డ్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. సాధారణంగా స్టార్ హీరోలు తమ స్నేహితుల పిల్లల సినిమాలను సమర్పిస్తున్నప్పుడు, కేవలం మొహమాటానికో లేదా స్నేహం కోసమో ప్రెజెంట్ చేశారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇదే విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం స్నేహితుడు మహేష్ రెడ్డి అబ్బాయి అనే కారణంతోనే తాను ఈ సినిమాను ప్రెజెంట్ చేయలేదని నాగార్జున స్పష్టం చేశారు. “వాళ్లు ముందుగా నాకు సినిమా చూపించి అడిగారు. కంటెంట్ నచ్చింది కాబట్టే ప్రెజెంట్ చేయడానికి ఒప్పుకున్నాను. కేవలం ఫ్రెండ్ అబ్బాయి అని నేను ప్రెజెంట్ చేస్తే సినిమాలు ఆడవు. ఎంతోమంది పెద్దవాళ్లు ప్రమోషన్స్ చేసినా కంటెంట్ లేకపోతే థియేటర్లలో నిలబడవు. మార్నింగ్ షో పడగానే సినిమా జాతకం తెలిసిపోతుంది” అని నాగ్ అన్నారు.
అంతేకాకుండా తన సినిమాల ఎంపికపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినిమాలో వర్త్ లేకపోతే నేను అస్సలు చేయను. కావాలంటే నా ట్రాక్ రికార్డ్ ఒక్కసారి చూడండి.. నేను ప్రొడ్యూస్ చేసినా, ప్రెజెంట్ చేసినా అవన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అవుతాయని చెప్పను కానీ, కనీసం ఫ్లాప్ అయితే అవ్వలేదు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది” అంటూ నాగార్జున బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే సందర్భంగా తన మైల్స్టోన్ మూవీ ‘కింగ్ 100’ గురించి కూడా నాగార్జున క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వచ్చే డిసెంబర్లో ‘కింగ్ 100’ థియేటర్లలోకి రాబోతోందని తెలిపారు. “ప్రస్తుతం ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. ఇప్పుడు సినిమా చూసుకుంటూ చిన్నచిన్న ప్యాచ్ వర్కులు, కరెక్షన్స్ పూర్తి చేస్తున్నాం” అని నాగార్జున వెల్లడించడంతో అక్కినేని అభిమానుల్లో జోష్ నెలకొంది.

