Site icon NTV Telugu

Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా?

Nagarjuna Konda Surekha

Nagarjuna Konda Surekha

Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ డిఫమేషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్‌ లో పేర్కొన్నారు. నిజానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని, హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్న ఆమె మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు.

Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్‌కు ఊహించని షాక్?

కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ అని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న క్రమంలో నిన్ననే నాగ చైతన్య తండ్రి, హీరో నాగార్జున స్పందించారు. “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.” అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Exit mobile version