Site icon NTV Telugu

Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!

Nagarjuna

Nagarjuna

నాగార్జున ఒకపక్క తన కుమారుడు అఖిల్ వివాహంతో బిజీగా ఉన్నప్పటికీ, సెకండ్ గీర్ ఇవ్వకుండా తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే, నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ముంబై బేస్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ముంబైలో పుట్టి, అడుక్కు తినే స్థాయి నుంచి ఒక పెద్ద మాఫియా డాన్‌గా ఎదిగిన వ్యక్తిగా ధనుష్ కనిపించబోతున్నాడు.

Also Read: కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?

సరిగ్గా నిన్న ఉదయమే అక్కినేని అఖిల్ వివాహం జరిగినప్పటికీ, సినిమాకు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా నాగార్జున తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు సినిమా టీమ్ ఒక ఫోటో రిలీజ్ చేసింది. అందులో నాగార్జున, శేఖర్ కమ్ములతో కలిసి డబ్బింగ్ థియేటర్‌లో గమ్మున కూర్చుని కనిపిస్తున్నారు.

Also Read: Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఇంటర్నల్ కమిటీ!

కుబేర జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌తో సహా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మికా, జిమ్ సర్భ్ పాత్రల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది.

Exit mobile version