King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా (#King100) సెన్సేషన్‌కు సిద్ధమవుతోంది. తనదైన స్టైల్, గ్రేస్ తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నాగ్.. తన మైల్ స్టోన్ మూవీని చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో యువ దర్శకుడు రా కార్తీక్ టాలీవుడ్‌కి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
నాగార్జున పుట్టినరోజు (ఆగస్టు 29) సందర్భంగా అక్కినేని అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. బర్త్ డే కి కేవలం మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభిమానుల్లో కౌంట్ డౌన్ మొదలైంది. ఈ స్పెషల్ డే కానుకగా సినిమాకు సంబంధించిన ‘టైటిల్ గ్లింప్స్’ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కావడంతో మేకర్స్ ఎలాంటి టైటిల్ తో రాబోతున్నారో తెలుసుకోవాలన్న ఉత్కంఠ సినీ వర్గాల్లోనూ, ఫ్యాన్స్ లోనూ విపరీతంగా నెలకొంది. ఈ సినిమాలో నాగార్జున సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ లాంటి బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ తర్వాత నాగార్జున, టబు కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుండటం ఈ ప్రాజెక్టుపై హైప్ ను అమాంతం పెంచేసింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మళ్లీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, దేవి శ్రీ కాంబోలో ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉండటంతో ఈ సినిమా ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్టు 29న విడుదల కాబోయే టైటిల్ గ్లింప్స్ తో పాటే, చిత్రంలోని ఇతర భారీ తారాగణం, టెక్నీషియన్ల వివరాలను కూడా మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..