అక్కినేని నాగచైతన్య ఎంగేజ్ మెంట్ ఈ రోజు అతికొద్ది మంది సమక్షంలో జరగనుంది. నాగచైతన్య త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు అక్కినేని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన సినీ కెరిరీ లో మెుదటి హిట్ సినిమా ఏమాయ చేసావేలో చైతన్యకు జోడిగా నటించిన సమంతతో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కాని ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అభి ప్రాయబేధాల కారణంగా ఇరువురు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తరువాత అదే అక్టోబరులో విడిపోతున్నట్టు ప్రకటించారు.
వీరి విడాకులపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. సమంతాదే తప్పని కొందరు వాదిస్తే కాదు చైతన్యదే తప్పని కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు నడిచాయి. అయితే సమంతతో వైవాహిక జీవితానికి శుభం కార్డు పడిన తర్వాత నాగ చైతన్య. శోభితా ధూళిపాళ్ళ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ ఆ జంట ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు అంగీకారం మేరకు, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరగనబోతుందని సమాచారం. ఈ కార్యక్రమానికి మీడియా అనుమతించ లేదు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్ధం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారకంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోనున్నరని తెలుస్తోంది. అక్కినేని కుటంబానికి కోడలిగా రాబోతున్న శోబిత గతంలో ఫెమినా మిస్ ఎర్త్ 2016 గా నిలిచింది. అలాగే గూడాచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్,కురుప్ వంటి సినిమాలలో కథానాయకగా నటించింది.