Site icon NTV Telugu

పవన్ ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ కు నాగబాబు ఫిదా

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్‌ బైక్‌పై బ్లాక్‌ షర్ట్‌ ధరించి, చేతిలో ఓ సూట్‌కేసు పట్టుకొని స్టైలీష్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్‌ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా ఉండటంతో చాలా వరకు అభిమానులు నమ్మేశారు. దీంతో ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏ విషయం అయినా తమ అధికారిక ఖాతాల ద్వారా వెల్లడించే వరకు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. అయితే తాజాగా ఈ పోస్టర్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘యంగ్ టాలెంట్ కి.. ఇంటర్నెట్ మరొక ఇల్లు లాంటిదని పేర్కొన్నాడు. వారి ప్రతిభను ఉద్దేశిస్తూ.. ‘వావ్’ అంటూ నాగబాబు పోస్టర్ షేర్ చేశారు.

View this post on Instagram

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

Exit mobile version