Site icon NTV Telugu

Nagababu: అల్లు vs మెగా వివాదం.. వెయిటింగ్ అంటూ నాగబాబు కీలక వ్యాఖ్య

Nagababu

Nagababu

Nagababu Comments on Allu Arjun goes Viral: అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదాలు అనే టాపిక్ ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచి ఈ వ్యవహారం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తో పాటు 21 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలో ఉంటే వాళ్లకు ప్రచారం చేయకుండా తన భార్య స్నేహితురాలి భర్త అని చెబుతూ శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళాడు. అప్పుడే మెగా ఫ్యాన్స్ అనేకమంది అల్లు అర్జున్ మీద విమర్శలు వర్షం కురిపించారు. ఈ వ్యవహారం మీద అనేక చర్చోపచర్చలు కూడా జరిగాయి.

Devara Chuttamalle song: దేవర చుట్టమల్లే సాంగ్ తెలుగు లిరిక్స్ మీకోసం!

ఇక తాజాగా అల్లు అర్జున్ మీద నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్ అని అడిగితే పుష్ప 2 కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేశాడు. మరొక సందర్భంలోనే అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు అని అడిగితే అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని చెప్పుకొచ్చాడు. దీంతో కొంతమంది అభిమానులు మెగా వర్సెస్ అల్లు అనే చర్చ మీడియాలో సోషల్ మీడియాలోనే తప్ప రియాలిటీలో లేదని నాగబాబు నిరూపించాడని వాళ్ళందరూ ఒకటే ఎలాంటి గొడవలు లేవని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పుష్పా 2 కోసం వెయిటింగ్ అన్నాడంటే దాని వెనుక నిగూడ అర్థం ఏమైనా ఉందేమో అనే కామెంట్లు కూడా చేస్తున్నారు.

Exit mobile version