NTV Telugu Site icon

Funky : ఏంటీ ‘ఫంకీ’ నాగ్ అశ్విన్ బయోపిక్కా?

Funky Nag Ashwin

Funky Nag Ashwin

విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే ఈ సినిమా నాగ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడడం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగ్ అశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకతో పరిచయం అయిన తరువాత ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఇప్పుడు దాదాపు అలాంటి కథతోనే సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Varun Tej : వరుణ్ తేజ్ ఏంటి అంత కంగారుపడుతున్నాడు ?

నిజానికి అనుదీప్ గతంలోనే పిట్టగోడ అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ అనుదీప్ చెప్పిన కథ నచ్చడంతో జాతి రత్నాలు అనే సినిమా నిర్మించి సూపర్ హిట్ అందించాడు. మరి ఆ కృతజ్ఞతతో బయోపిక్ చేస్తున్నాడో లేక సరదాగా అలాంటి కథ కావడంతో ఒక పోలిక కోసం నాగవంశీ ఇలా చెప్పాడో తెలియదు కానీ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక నాగ వంశీ సోదరి హారిక నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నిర్మాతగా వ్యవహరించినా కూడా నాగవంశీ మార్క్ ఉండడంతో ప్రమోషన్స్ లో ఆయనే ఎక్కువగా కనిపిస్తున్నారు.