NTV Telugu Site icon

Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు

Lucky Baskher

Lucky Baskher

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే, అనగా అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విడుదలకు ముందే లక్కీ భాస్కర్ పై ఈస్థాయి అంచనాలు ఏర్పడటం సంతోషంగా ఉంది. కొన్ని సినిమాలు మంచి సినిమా చేశామనే సంతృప్తిని కలిగిస్తాయి.

Ravi Teja : రవితేజ ‘మాస్ జాతర’కి సిద్ధమా?

అలాంటి సంతృప్తిని ‘లక్కీ భాస్కర్’ కలిగించింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాము. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచామని అన్నారు. సినిమాకి టాక్ బాగా వస్తుందన్న నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముందని అన్నారు. మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం అని నాగవంశీ అన్నారు.

Show comments