NTV Telugu Site icon

Devara: దేవర కలెక్షన్స్.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

Devara 12

Devara 12

Naga Vamsi Comments on Devara Collections: దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగ వంశీ ఆసక్తికరమైన ధరకు దక్కించుకున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా తమ లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి నాగ వంశీ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో దేవర కలెక్షన్స్ గురించి ఆయనని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారా అంటే చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

AAP: కాంగ్రెస్‌ని మరోసారి దెబ్బతీసిన ఆప్.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు..

అలాగే కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం జరుగుతుంది. కాస్త ఎక్కువ చేసి చెబుతున్నారట నిజమేనా అని అడిగితే అదేమీ లేదని తనకు వచ్చిన కలెక్షన్స్ ఉన్నవి ఉన్నట్టుగానే తాను చెప్పానని చెప్పుకొచ్చారు. తాను డబ్బులు వచ్చాయి అని చెబుతున్నా మీడియా నమ్మడం లేదు కాబట్టి మీడియా నమ్మితే వచ్చినట్టు ఫీల్ అవుతాను అన్నట్టు ఆయన మాట్లాడారు. అంతేకాక అసలు ఇలా కలెక్షన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే ఇది ఎవర్నో ఉద్దేశించి రిలీజ్ చేయడం కాదని ఆయన అన్నారు. కేవలం హీరోల అభిమానులను సంతృప్తి పరచడం కోసమే కలెక్షన్స్ నంబర్స్ రిలీజ్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దేవర విషయంలో తాను అమ్మిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారని వాళ్లు హ్యాపీగా ఉంటే తాను కూడా హ్యాపీగా ఉన్నట్లేనని అని చెప్పుకొచ్చారు..

Show comments