NTV Telugu Site icon

Naga Vamsi: కొడతానంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ

Naga Vamsi Comments

Naga Vamsi Comments

వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశాం.

Mumbai Indians IPL 2025: కొత్త ఫీల్డింగ్ కోచ్‌ని ప్రకటించిన ముంబై ఇండియన్స్

‘డాకు మహారాజ్’ సినిమాని తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ జనవరి 12న విడుదలవుతోంది. ‘డాకు మహారాజ్’తో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను. ‘డాకు మహారాజ్’ చిత్రం అసలు నిరాశ పరచదు. బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.” అన్నారు. అయితే శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ ఉండగా మళ్ళీ ఊర్వశిని తీసుకోవాడానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించగా ఆ సాంగ్ డ్యాన్స్ లో వీళ్ళు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు కానీ ఆమె ఒప్పుకుంది అని కామెంట్ చేశారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.