NTV Telugu Site icon

Naga Vamsi: అన్ స్టాపబుల్ షోలో జూ.ఎన్టీఆర్ పంచాయితీ.. నాగవంశీ క్లారిటీ

naga vamsi

naga vamsi

అన్ స్టాపబుల్ షో లో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ డాకు మహారాజ్ సినిమాని చూడమంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకరకంగా బాబీ డైరెక్ట్ చేసిన సినిమాలన్ని ప్రస్తావించి, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ప్రస్తావించకపోవడంతో కావాలని ప్రస్తావించలేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రస్తావించారు కానీ ఎడిటింగ్ లో కట్ చేశారంటూ మరో ప్రచారం జరిగింది.

Assam: ముంచెత్తిన వరద.. “ర్యాట్ హోల్” బొగ్గు గనిలో చిక్కుకున్న 18 మంది కార్మికులు..

అయితే ఆ షోలో పాల్గొన్న డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ ఈ విషయం మీద స్పందించారు. షోలో అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ జై లవకుశ ప్రస్తావన కానీ రాలేదని అన్నారు. రానప్పుడు దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే బయట ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్న సమయంలో మాత్రం ఏదో ఒక పాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ అన్నారని ఆయన అన్నారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు ఇలా వివాదం చెలరేగడం కరెక్ట్ కాదని ఎందుకంటే తాను అటు తారక్ గారి సినిమాలు చూస్తాను, బాలకృష్ణ గారి సినిమాలు చూస్తాను రేపు మోక్షజ్ఞ వస్తే ఆయన సినిమాలు కూడా చూస్తానికి ఎదురు చూస్తాను. మాలాంటి వాళ్ళం ఇలాంటి వివాదాల వల్ల బాధపడతామని ఈ సందర్భంగా నాగ వంశీ చెప్పుకొచ్చారు.

Show comments