Vrushakarma Trailer on November 25: ‘వృషకర్మ’ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు చిత్ర యూనిట్ తెరదించింది. సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే డిసెంబర్ 4న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ వదిలింది. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.
నవంబర్ 25న భారీ ఈవెంట్ నిర్వహించి వృషకర్మ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫైనల్ ఎడిట్ కూడా లాక్ అయినట్లు సమాచారం. దీంతో డిసెంబర్ 4న సినిమా విడుదల కావడం ఖాయమని చిత్ర బృందం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వృషకర్మ ఒకటి. విరూపాక్షతో దర్శకుడు కార్తీక్ వర్మ దండు, తండేల్‌తో హీరో నాగచైతన్య వంద కోట్లు కొల్లగొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్లో చై సరసన మీనాక్షి చౌదరి నటించారు. స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, సత్య, జరీనా వాహబ్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు చేశారు.

