Site icon NTV Telugu

కొత్త ప్రాజెక్ట్ కు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ?

Naga Chaitanya to team up with Kishore Tirumala for his next?

అక్కినేని నాగ చైతన్య చివరిసారిగా “వెంకీ మామా” చిత్రంలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత చాల గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడట. అందులో భాగంగానే తాజాగా చై కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విన్పిస్తున్న వార్తల ప్రకారం… నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ వార్తలు గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మొదటి మూవీ ఇదే అవుతుంది. కిషోర్ తిరుమల ఇంతకుముందు నేను శైలజ, చిత్రలహరి, రెడ్ మూవీలను తెరకెక్కించారు.

Read Also : టాలెంటెడ్ హీరోకు ప్రెజెంటర్ గా కొరటాల…!

చైతన్య ప్రస్తుతం “థాంక్యూ” మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. త్వరలో “లాల్ సింగ్ చద్దా, బంగార్రాజు” మూవీ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల్లో చైతన్య అతిథిపాత్రలో కనిపించనున్నాడు. ఇక “లాల్ సింగ్ చద్దా”తో చై బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుత ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కిషోర్ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి కిషోర్ తిరుమల “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు చైతన్య “లవ్ స్టోరీ” విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.

Exit mobile version