Site icon NTV Telugu

Thandel Trailer: తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్.. నాగచైతన్య మాస్ ట్రీట్ రెడీ!

Nagachaitanya

Nagachaitanya

అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘తండేల్‌’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ట్రైలర్‌ పరిశీలిస్తే ఆద్యంతం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాస కూడా సెట్ అయింది. ఇక తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అనే ఓ డైలాగ్ కూడా ట్రైలర్లో వినిపంచారు. రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.

Congo fever: గుజరాత్‌లో ‘కాంగో ఫీవర్’ కలకలం.. 5 ఏళ్లలో తొలి మరణం..

వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. తరచూ చేపల వేటకు వెళ్లే అతడు ఆమెకు దూరమవుతూ మళ్ళీ చేరువవుతూ ఉంటాడు కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దు జలాల్లోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోతాడు. ఇక అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊర కుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగ్స్ చైతూ నోటి వెంట వినిపించారు. ఎమోషనల్‌ అండ్‌ ఇంటెన్స్‌ లవ్‌స్టోరీతో సాగిన ఈ ట్రైలర్‌ మూవీ మీద మరిన్ని అంచనాలు పెంచేస్తొంది.

Exit mobile version