గత ఏడాది చివరిలో నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండటం విశేషం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్ ఏదైన సరే.. పని పరంగా తళుక్కు మంటూనే ఉన్నారు. అయినా కూడా వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు.
Also Read: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకున్నాడు.. ‘శోభిత తో నా జీవితం సంతోషంగా సాగుతుంది. పని ఒత్తిడిలోనూ మేమిద్దరం కలిసి గడిపే క్షణాలకు ప్రాధాన్యం ఇస్తాం. హైదరాబాద్‌ల్లో ఉన్నప్పుడు ఉదయం, రాత్రి కలిసి భోజనం చేయాలని ఒక నిబంధన పెట్టుకున్నాం. ఇదే మా బంధానికి బలం. ఆదివారాలు మాకెంతో ప్రత్యేకం. అప్పుడు మా ఇద్దరి హాబీలకు టైమ్ ఇస్తాం. సినిమాలు చూస్తాం, బయటకెళ్తాము, లవ్డ్ ఫుడ్ ఆర్డర్ చేస్తాం లేక ఇంట్లో కలిసి వండుకుంటాం. ఆ క్షణాలు మాకు చాలా విలువైనవి. శోభితకు పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం, నాకు రేసింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఇటీవల ఆమెకు రేస్ ట్రాక్ డ్రైవింగ్ నేర్పించాను. ఆమె ఎంతో ఎంజాయ్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు ప్రేరణ నిచ్చే వ్యక్తుల గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. ‘నాకు రతన్ టాటా అంటే నాకు అపార గౌరవం. ఆయన్ని రియల్ లైఫ్ హీరోగా చూస్తా’ అని తెలిపారు చై..
