మొత్తానికి ‘తండేల్’ మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఆయన కెరీర్‌లోనే తొలి 100 కోట్ల చిత్రం ఇది. దీంతో అందరి చూపు చై తదుపరి చిత్రం NC24పై నెలకొంది. చైతన్య ఎవరితో నటిస్తున్నారు? ఎలాంటి కథలు ఎంచుకుంటారు అని. ఇక ‘తండేల్’ హిట్ జోష్‌ను అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన చైతూ తొందర పడకుండా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read : Samantha : ఆ రోజులు బాగా గుర్తొచ్చాయి..!
కాగా ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన 24వ సినిమాను లాక్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్‌లు సంయుక్తంగా నిర్మించనున్నా ఈ సినిమాకు ప్రస్తుతం NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఎన్‌సీ 24 ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్ అంటూ ఇటీవలే స్పెషల్ వీడియోను రిలీజ్ చేయగా అది మూవీపై అంచనాలను పెంచింది. ఈ సినిమా కోసం చైతూ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. అంతేకాదు నాగచైతన్య కెరీర్‌లోనే ఇది తొలి పాన్ ఇండియా సినిమాగా నిలవనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుందట. మొత్తానికి మీనాక్షి మంచి ఛాన్స్ కొట్టేసింది అనే చెప్పాలి. ఇక ఈ మూవీ కోసం అత్యంత సహజమైన ఓ భారీ గుహ సెట్ ని తీర్చిదిద్దారు. ఈ గుహలోనే 18 రోజుల చిత్రీకరణ జరుగనుందట. ఈ సెట్లోనే తాజాగా చిత్రబృందం మీడియా ప్రతినిధులతో సమావేశం అయి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
