Site icon NTV Telugu

Naga Chaitanya: నాగచైతన్య సినిమాకి అదిరే డీల్.. అమ్మేశారు!

Nagachaitanya

Nagachaitanya

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక ఆసక్తికరమైన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 శాతం మాత్రమే జరిగింది. ఇంకా ఫస్ట్ కాపీ కూడా రాలేదు. కానీ, అప్పుడే ఈ సినిమా అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే, వరల్డ్‌వైడ్ థియేటర్ హక్కుల కొనుగోలు జరిగిపోయింది. ఏపీ, నైజాం, సీడెడ్, ఓవర్సీస్, అలాగే ఇండియాలోని ఇతర రాష్ట్రాలన్నీ కలిపి హోల్‌సేల్‌గా సితార నాగవంశీ కొనుగోలు చేశారు. ఆయన మంచి రేటుకు సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 35 కోట్ల వరకు సినిమాను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Jayam Ravi: భార్య అరాచకంపై జయం రవి సంచలన ఆరోపణలు

నిజానికి ఈ సినిమా ఇంకా 10% షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇప్పటికిప్పుడు డీల్ ఫిక్స్ చేసుకోవాలంటే సగానికి పైగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కలు వేసుకున్న నాగవంశీకి ఇది ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ‘విరూపాక్ష’ సూపర్ హిట్ కావడం, ఇటీవల నాగచైతన్య నటించిన ‘తండేల్’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. కంటెంట్ ఉంటే సినిమా సెట్స్ మీద ఉండగానే ఇబ్బంది లేకుండా అమ్మకాలు జరిగిపోతాయనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.

Exit mobile version