NTV Telugu Site icon

Naga Chaitanya : ‘మ్యాడ్’ కామెడీ సీన్స్ చూస్తూ నా ఒత్తిడిని దూరం చేసుకుంటా

Mad2 (2)

Mad2 (2)

ఎలాంటి అంచనాలు లేకుండా 2023లో చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’  ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వ‌స్తోంది. ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా  అక్కినేని నాగచైతన్య హాజరవగా, ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఇందులో భాగంగా చైతన్య మాట్లాడుతూ..

Also Read: Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ కారుని ఢీకొట్టిన బ‌స్సు..!

‘ మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్ అన్నాలి ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ ఈవెంట్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ ఒత్తిడి దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచివి. డల్‌గా ఉన్నప్పుడు, మూడ్ బాగోలేనప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. కామెడీ పండించడం చాలా కష్టం.. నార్నె నితిన్, రామ్, సంగీత్‌లో ఆ టాలెంట్ చాలా ఉంది. కాబట్టి జనాలను ఇంత నవ్వించగలిగారు. ఈ మూవీతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ఇక స్టోరీ డిస్కషన్‌లో దర్శకుడు కళ్యాణ్‌తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్‌కే పడిపడి నవ్వాను. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.