NTV Telugu Site icon

Naga Chaitanya: ఎంగేజ్మెంట్ కి ముందు సమంత ఫోటోలు డిలీట్ చేసిన నాగ చైతన్య?

Naga Chaitanya Deletes Phot

Naga Chaitanya Deletes Phot

Naga Chaitanya Deletes Photos With Samantha Before Engagement with Sobhita Dhulipala: చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగబోతోంది ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు నాగ చైతన్య తండ్రి హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించి వారికి ఆశీర్వాదం అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఒకపక్క అభిమానులందరూ ఎంగేజ్మెంట్ విషయంలో అభినందనలు చెబుతుంటే సమంత అభిమానులు మాత్రం నాగచైతన్య సోషల్ మీడియా అకౌంట్ నుంచి సమంతతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ అయినట్టు గుర్తించారు.

Sobhita Dhulipala : సమంత నాగచైతన్య విడాకుల తర్వాత.. శోభిత ఏమన్నదంటే?

పింక్ విల్లా లాంటి కొన్ని నేషనల్ సైట్స్ సైతం ఇదే విషయం ధ్రువీకరిస్తూ కొన్ని వార్తలు రాస్తున్నాయి. అయితే సమంత ఉన్న ఒక ఫోటో మాత్రం నాగచైతన్య సోషల్ మీడియాలో ఉందని వీరిద్దరూ కలిసి మజిలీ టీంతో కలిసిన ఫోటోలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే నాగచైతన్య సోషల్ మీడియాలో మజిలీ పోస్టర్ కూడా ఉందని చెబుతున్నారు. ఇవి కాకుండా వీరిద్దరూ పర్సనల్గా షేర్ చేసిన అప్డేట్స్ అయితే డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.

Show comments