NTV Telugu Site icon

విషాదంలో నాగబాబు… సన్నిహితుడి మృతి

Naga Babu’s close associate Ambati Raja dies of Covid-19

కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. చాలామంది వైరస్ బారిన పడి కోలుకోగా, మరికొందరు కరోనావైరస్ తో యుద్ధం చేసి చివరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్ కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన మరొక వ్యక్తి మరణించాడు. కొన్ని చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పని చేసిన అంబటి రాజా కరోనా మహమ్మారితో పోరాడి కన్నుమూశారు. రాజా అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న అతని పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. అంబటి రాజాకు మెగా ఫ్యామిలీతో, ముఖ్యంగా నాగబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై నాగబాబు స్పందించారు. “నిన్ను కోల్పోవడం నాలో కొంత భాగాన్ని కోల్పోవడం లాంటిది… మీరు నా సోదరుడి లాంటి వారు… మై డియర్ రాజా నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం” అంటూ ఆయన సోషల్ మీడియాలో అంబటి రాజా మృతికి సంతాపం తెలియజేశారు. అంబతి రాజా మృతిపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.