నాగ్ అశ్విన్ ఇప్పటికే దర్శకుడిగా కొన్ని సినిమాలు చేశారు. నిర్మాతగా మారి జాతి రత్నాలు లాంటి హిట్ సినిమా నిర్మించారు. ప్రస్తుతం కల్కి సినిమాను పూర్తిచేసిన ఆయన, ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ కోసం పనిచేస్తున్నారు. ప్రభాస్ ఖాళీ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగ్ అశ్విన్ మరోసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
Also Read :Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?
సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించబోయే ఒక సినిమాను ఆయన నిర్మించబోతున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ సింగీతం గారితో గతంలో కూడా కొన్ని సినిమాలకు కలిసి పని చేశారు. వీరిద్దరూ కలిసి మహానటి తో పాటు ఇటీవల విడుదలైన కల్కి సినిమాకి కూడా కొంత వర్క్ చేశారు. ఆ తర్వాత సింగీతం తాత్కాలికంగా దూరమైనా, నాగ్ అశ్విన్ మాత్రం ఆయన పట్ల గాఢ గౌరవం కలిగి ఉన్నారు. ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఒక సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించబోతున్నారని సమాచారం. అయితే ఇది ఎప్పుడు నిజమవుతుందో, కాలమే నిర్ణయించాలి
