Site icon NTV Telugu

Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?

Nag Ashwin Priyanka Dutt Love Story

Nag Ashwin Priyanka Dutt Love Story

Nag Ashwin Love story with Priyanka Dutt :డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్స్‌ తో కలిసి చేసిన ‘ కల్కి 2898 ఏడీ’ గత నెల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ తెచ్చుకున్న ఈ సినిమాతో హాలీవుడ్‌ స్థాయికి టాలీవుడ్‌ను నాగ్‌ అశ్విన్‌ తీసుకుబోయాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. నాగ్‌ టాలెంట్‌కు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాను ప్రియాంకను చేసుకోక పోయి ఉంటే చేయలేనని అన్నాడు. వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారని చాలా మందికి తెలుసు కానీ ఎలా జరిగింది అనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఆ వివరాలు మీకోసం నాగ్ అశ్విన్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తెను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భిన్న నేపధ్యాలు కలిగిన వీరి మధ్య సినిమానే మాద్యమంలా పని చేసి ప్రేమకు కారణం అయ్యింది. మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కూతురైన ప్రియాంక దత్ దర్శకుడుగా నాగ్ అశ్విన్ సక్సెస్ కాకముందే అతన్ని నమ్మిందని చెప్పక తప్పదు.

Breaking: Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు అరెస్ట్

ఓ సందర్భంలో నాగ్ అశ్విన్ దీనిపై స్పందించారు. ప్రొఫెషనల్ గా ప్రియాంకతో ఎప్పటి నుండో నాగ్ అశ్విన్ కి పరిచయం ఉంది. కొన్ని యాడ్స్ వీరు కలిసి చేశారు. ఆ పరిచయంతోనే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి నిర్మాతగా ప్రియాంక దత్ వ్యవహరించారు. ఇక వీరి ప్రేమ కథ వ్యవహారానికి వస్తే.. చాలా సింపుల్ గా వీరి ప్రపోజల్ జరిగింది. ప్రియాంక దత్ కి పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో.. మీకు ఎవరైనా నచ్చితే ఓకే… లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నారు నాగ్ అశ్విన్. చాలా కాలంగా నాగ్ అశ్విన్ తో ట్రావెల్ చేస్తున్న ప్రియాంకకు అతని మంచితనం నచ్చడంతో ఓకె చెప్పడం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడమా జరిగిపోయిందని నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రియాంకతో పెళ్లి తరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మహానటి భారీ విజయాన్ని అందుకుంది. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సైతం అందుకుంది. ఆ తరువాత కల్కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

Exit mobile version