కరోనా మహమ్మారి ఎంతోమంది బలి తీసుకుంటోంది. ఆ జాబితాలో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయిన వారి కుటుంబాలకు పలువురు సెలెబ్రిటీలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. తాజాగా ‘నాంది’ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కరోనాతో ప్రాణాలు కోల్పోయిన పలువురు సినీ కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాకుండా ఇంకా సాయం చేయడానికి ముందుకు రావాలంటూ, చేతనైన సాయం చేసి మిగిలిన వారి ప్రాణాలు కాపాడుకుందాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు విజయ్ కనకమేడల. “మిత్రులందరికీ నమస్కారం.. మన దర్శకుల సంఘం సభ్యులు కూనంశెట్టి వెంకటేశ్వరరావు గారు, శ్రావణ్ గారు, శ్రీకారం సినిమా కోడైరెక్టర్ రాజా గారు, మా అబ్బాయి సినిమా డైరెక్టర్ కుమార్ గారు కరోనా వల్ల రీసెంట్ గా మరణించిన సంగతి తెలిసిందే. ఈ టైంలో వారి కుటుంబాలకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను నా వంతుగా ఒక్కొక్క కుటుంబానికి 25,000 /చొప్పున లక్ష రూపాయలు వారం క్రితమే ట్రాన్స్ ఫర్ చేయడం జరిగింది. ఇది తెలిసి మిత్రులు కృతజ్ఞతలు చెప్పి.., ప్రస్తుతం కరోనా వల్ల,లాక్ డౌన్ వల్ల సఫర్ అవుతున్న మన దర్శకుల సంఘ సభ్యుల ఫ్యామిలీలు చాలా ఉన్నాయి వీలైతే వారికి ( మినిమమ్ గ్రో సరీస్, మెడికేషన్స్, మెయింటనెన్స్ కి ) కూడా ఎంతో కొంత సహాయం చేయండి అంటూ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేము కానీ ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం వుంది. మనకు చేతనైన సహాయం చేసి ఒక మంచి పనికి “నాంది” పలుకుదాం. అందుకు నేను మిమ్మల్నీ అడుగుతున్నాను ,నా తరపున మీ తరఫున మన అందరి తరపున అత్యవసరమైన వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రండి. నా సోషల్ మీడియా మిత్రులు మీరు దయచేసి మీకు తోచినంత సహాయం చేయండి. చాలామంది జీవితాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. ఈ బాధ్యతను పూర్తిగా నేనే స్వయంగా చూసుకుంటాను. నా అకౌంట్ నెంబర్ కింద ఇస్తున్నాను…… K VIJAYA KRISHNA, SBI- 20166192932, LANCO HILLS BRANCH, IFSC CODE – SBIN0015780… ధన్యవాదములు” అంటూ దర్శకుడు విజయ్ కనకమేడల అందరిని రిక్వెస్ట్ చేశారు.
అలా చేసి ఒక మంచి పనికి “నాంది” పలుకుదాం : విజయ్ కనకమేడల
