NTV Telugu Site icon

Re-release: స్వీట్ మెమోరీస్ పుట్టుకొస్తున్న ‘నా ఆటోగ్రాఫ్’

February 7 (64)

February 7 (64)

ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థీయెటర్ లో బడ సినిమాలు నడుస్తున్న కూడా, అదే టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.మొదట్లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. చూసిన సినిమాలే అయినప్పటికి భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఫీల్ గుడ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే త్రి, ఆరెంజ్, ఓయ్ వంటి లవ్ స్టోరీస్ రీ రిలీజ్ కాగా తాజాగా ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమరీస్’ మూవీ కూడా రీ రిలీజ్ కి సిద్ధం అయింది.

Also Read:Rashmi: హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ..!

దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ రవితేజ కెరీర్‌లో వెరీ స్పెషల్ అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన, ఆ తర్వాత టీవీలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయింది. ముఖ్యంగా ఈ మూవీలోని లవ్ స్టోరీ, పాటలు యూత్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి మన జ్ఞాపకాలు గుర్తు చేసేందుకు రెడీ అయ్యింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 22న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.