Mandadi: సుహాస్, సూరి ‘మండాడి’ తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ & డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘మైత్రి మూవీస్’ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ తెలుగు పంపిణీ హక్కులను మైత్రి మూవీస్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అత్యంత భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో సుహాస్, కోలీవుడ్ విలక్షణ నటుడు సూరి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా సుహాస్, సూరిల క్యారెక్టర్ మేకోవర్స్, వారి సరికొత్త లుక్స్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఇద్దరు నటుల కెరీర్లో సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, లార్జర్ ద్యాన్ లైఫ్ విजुవల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా చెప్తోంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ‘బోట్ యాక్షన్ సీక్వెన్స్’ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుందని, ఇది సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ వంటి టాప్ స్టంట్ మాస్టర్స్ ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను కంపోజ్ చేశారు.
Also Read
- Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్'గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!