Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Ravi: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన వై.రవిశంకర్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం), బ్యాక్‌గ్రౌండ్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన ‘రాజా ది రాజా’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్ లేదా డైమండ్ స్పూన్‌తో పుట్టి రావచ్చు. కానీ, ఇక్కడ ఆ స్పూన్లు ఏమాత్రం పని చేయవు. ఇండస్ట్రీలో ఒకరిని నిలబెట్టేది, నడిపించేది కేవలం వారిలో ఉన్న స్వయం ప్రతిభ మాత్రమే” అంటూ రవిశంకర్ స్పష్టం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ ఇవ్వడానికే ఉపయోగపడుతుందని, ఆ తర్వాత ప్రేక్షకులు ఆదరించాలంటే టాలెంట్ ఒక్కటే శరణ్యమని ఆయన చెప్పుకొచ్చారు.
కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటీనటులకు ఆయన ఒక పవర్ఫుల్ సందేశాన్ని ఇస్తూ.. “మన వెనుక ఎవరి అండా లేదు, మనల్ని నడిపించే గాడ్‌ఫాదర్ ఎవరూ లేరని భావించి క్షేత్రస్థాయి నుంచి కష్టపడితేనే పరిశ్రమలో నిజమైన విజయం దక్కుతుంది” అని కొత్త హీరో రిత్విక్‌కు దిశానిర్దేశం చేశారు. సినిమా పట్ల అంకితభావం, కష్టపడే తత్వమే కెరీర్‌ను నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రవిశంకర్ చేసిన ఈ కామెంట్స్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కష్టపడితేనే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే నిజాయితీ గల మాటలను మైత్రీ నిర్మాత ఓపెన్‌గా చెప్పడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
తాజావార్తలు
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!