NTV Telugu Site icon

Mythri Movie Makers: పుష్ప 2 రిలీజ్ ముంగిట.. మైత్రీ మేకర్స్ వ్యూహాత్మక నిర్ణయం

Pushpa 2 Runtime

Pushpa 2 Runtime

పుష్ప 2కు ఎంతటి హైప్ తీసుకొచ్చినా..ఎక్కడో భయం నిర్మాతలను వెంటాడుతూనే ఉంది.ఫస్ట్ డే మార్నింగ్ షోకు వచ్చే టాక్.. రిజల్ట్ ను డిసైడ్ చేసే పరిస్థితులు ఉండడంతో సుకుమార్ పై ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుంది. నిజానికి పుష్ప-2కు… అనుకున్నదానికంటే ఓవర్ హైప్ వచ్చేసింది.ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందనే అంచనాలు మేకర్స్ లో ఒత్తిడి పెంచేస్తున్నాయి. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఎన్నో సినిమాల రికార్డులు గల్లంతైపోతాయంటున్నారు. అయితే రియాల్టీలో పుష్ప 2 ఆ స్థాయి సక్సెస్ ను అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే సినిమాపై ముందు నుంచి మార్కెట్లో నెగిటివ్ ప్రచారం గట్టిగా నడుస్తుంది. అందుకు తగ్గట్లుగానే బన్నీ చూపించిన ఆటిట్యూడ్ తో.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏ రకంగా కాస్త నెగిటివ్ గా కనిపించినా అది సినిమా మొత్తానికి ఆపాదించి బొమ్మకు డివైడ్ టాక్ తెచ్చేస్తారు.

మైత్రి మేకర్స్ మార్కెట్లో నడుస్తున్న నెగిటివిటీని గమనిస్తూనే ఉంది. అందుకే దర్శకుడు సుకుమార్ ను మాత్రమే నమ్ముకుంది. ఇప్పుడున్న టైమ్లో తన హుందాతనంతో కంటెంట్ విషయంలో సుకుమార్ తోనే సోమవారం ఈవెంట్ లో ఓ స్టేట్మెంట్ ఇప్పించే ఆలోచనలో నిర్మాతలున్నారు. మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కి చెక్ పెడుతూ… సుకుమార్ ఇచ్చే స్పీచ్ తో ..నెట్టింట్లో నడుస్తున్న నెగిటివిటీ కొంతవరకు తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావచ్చు.నిజానికి ఇక్కడ హీరోయిజంతో సినిమా నడిపించాలనే ఉద్దేశ్యం దర్శకుడికి లేదు. తాను నమ్మిన కంటెంట్ తో మాత్రమే బొమ్మను ఆడించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పుష్ప 2కు పెద్ద టాస్క్ గా చెబుతున్న ఫస్ట్ డే రికార్డ్ పై .. మైత్రి మేకర్స్ కు అంత ఆసక్తి లేదన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. అల్లు కాంపౌండ్ ఈ టాస్క్ పై శ్రద్ద చూపిస్తుండడంతో చేసేది లేక అందుకు తగ్గట్టుగా అడుగులు వేయాల్సి వస్తుందట. థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ వేయి కోట్ల బిజినెస్ జరిగిందని తెలియడంతో ఈక్వేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి.

వాటిని అందుకోవడంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ట్రోలింగ్ అవ్వడం ఖాయం.ఇక్కడ మైత్రి సంస్థకు బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే బజ్ క్రియేట్ చేసి అవుట్ పుట్ మ్యాటర్లో ట్రాక్ తప్పితే అది తమ ఇమేజ్ కు పెద్ద నష్టమే. అందుకే హీరో చూపిస్తున్నట్లుగా నిర్మాతలు ఎక్కడో హడావిడి చేయడం లేదు. భారీ భారీ స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు.ఇక్కడంతా స్లో అండ్ స్టడీనే నడుస్తోంది. చూడాలి ఇవాళ్టి స్పీచ్ తో సుక్కూ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.