NTV Telugu Site icon

Court : 25 నా ఏళ్ళ కల.. ఇప్పటికి నెరవేరింది : శివాజీ

Court (3)

Court (3)

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది.

Also Read : Natural Star : ‘కోర్ట్’ సినిమా నన్ను గెలిపిచింది

ఈ సందర్భంగా యాక్టర్ శివాజీ మాట్లాడుతూ ’25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. నాని ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయనలానే కొత్త తరహలో దమ్మున్న సినిమాలు చేస్తున్నారు. ఆయన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది దర్శకులు. సినిమాలు చేయాలని కసి నాకూ వుంది. ఆ కసికి సాకారం నాని గారు రామ్ ఇచ్చారు. ఇకపై సినిమాలు చేస్తాను. ఈ సినిమా గొప్ప ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాలో పని చేసిన అందరూ అద్భుతంగా చేశారు. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా జిందాబాద్, ప్రొడ్యూసర్ జిందాబాద్’ అని అన్నారు.