Site icon NTV Telugu

Mutton Soup: ఆసక్తికరంగా ‘మటన్ సూప్’ టీజర్

Mutton Soup

Mutton Soup

క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి.

Also Read:Meesala Pilla: ఈ మీసాల పిల్ల స్లో పాయిజన్ లా ఉందే !

దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 1) నాడు ‘మటన్ సూప్’ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను లాంఛ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

Exit mobile version