NTV Telugu Site icon

సూర్య సినిమా సంగీత దర్శకుడి కన్నుమూత

Music Director TS Muralidharan Passes Away

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘శ్రీ’ చిత్ర సంగీత దర్శకుడు టి. ఎస్. మురళీధరన్ నిన్న చెన్నైలో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం అంత్యక్రియలు జరిగాయి. 2002లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘శ్రీ’ తోనే ఆయన సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. పుష్పవాసగన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సూర్య సరసన శ్రుతిక హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ’ మూవీ కమర్షియల్ గా పెద్దంత విజయం సాధించకపోయినా సంగీత దర్శకుడిగా మురళీధరన్ కు మంచి గుర్తింపే వచ్చింది. కానీ చిత్రంగా ఆ తర్వాత ఆయనకు పెద్దంతగా అవకాశాలు రాలేదు. 2020లో వచ్చిన పొలిటికల్ సెటైర్ మూవీ ‘గోదామ్’కు మురళీధరన్ నేపథ్య సంగీతం అందించారు. ప్రతిభావంతుడైన మురళీధరన్ మృతి పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

Read Also : ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క స్టార్ ధనుష్ !