ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క స్టార్ ధనుష్ !

కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటి బాట పట్టాయి. లేదంటే థియేటర్లలో సందడి చేశాయి. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కర్ణన్’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటికీ విజయవంతం అయ్యింది. తరువాత అతని యాక్షన్-డ్రామా ‘జగమే తందిరమ్’ ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అది పెద్దగా అలరించలేకపోయింది. కాగా తాజాగా ధనుష్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Read Also : “సూర్య40” ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే?

ట్విట్టర్లో 10 మిలియన్ (1 కోట్ల) ఫాలోవర్లను సంపాదించారు. తద్వారా కోలీవుడ్లో మిగతా అగ్రతారల రికార్డులను అధిగమించిన మొదటి నటుడు అయ్యాడు. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ధనుష్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంటూ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇటీవల యూఎస్ లో ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ధనుష్ ఇటీవలే ఇండియా చేరుకున్నారు. అనంతరం “డి43” అనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. దీనికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ తరువాత శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు ధనుష్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-