NTV Telugu Site icon

Mohan Babu: మోహన్‌బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు?

Mohan Babu

Mohan Babu

మీడియాపై మోహన్‌బాబు దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు గుమికూడి ఉన్నారు. ఆ సమయంలో కొందరిని మనోజ్ తనకు సపోర్టుగా లోపలి రావాలని కోరాడు. ఆ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఛానల్ మైకు తీసుకుని మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఓ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు సెక్షన్లు మార్చారు. తాజాగా మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు.

Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. రెక్కీ చేసి పుష్ప 2 థియేటర్ దోచేశారు!

BNS 109 సెక్షన్‌ కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. నిజానికి ముందుగా నిన్న 118 సెక్షన్‌ కింద మోహన్‌బాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని సెక్షన్ మార్చారు పోలీసులు. ఇక మరోపక్క మంచు మనోజ్ ఫ్యామిలీ పై దాడి కేసులో ఒకరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ కిరణ్ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయ్ కోసం గాలింపు మొదలు పెట్టారు. మంచు మనోజ్ పై మోహన్ బాబు ఆదేశాలతో కిరణ్, విజయ్ దాడి చేసినట్టు గుర్తించారు. తనపై దాడి తర్వాత సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్ళారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.

Show comments