Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న “ముగ్గురు మొనగాళ్లు” ట్రైలర్

'Mugguru Monagallu' Trailer unveiled

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ “ముగ్గురు మొనగాళ్లు”. శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడి పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా కనిపించనున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ కథానాయికలుగా నటించారు. రాజా రవీంద్రను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా… అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మర్డర్ మిస్టరీలో చిక్కుకున్న ఈ ముగ్గురు మొనగాళ్లు ఆ కేసును ఎలా ఛేదించారనేది చిత్ర కథాంశం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో కామెడీతో పాటు సస్పెన్స్ తో ముడిపడి ఉంది. కామెడీతో పాటు ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version