Site icon NTV Telugu

Mrunal : మృణాల్‌ ఠాకూర్ కు తీవ్ర అవమానం.. స్టార్ కిడ్ పై సంచలన ఆరోపణలు

Janvi , Mrunal

Janvi , Mrunal

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మారాఠి చిత్రాలతో హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ 30, జెర్సీ వంటి వంటి చిత్రాలతో హిందీలోనూ సెన్సేషనల్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారమం’ లో నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో మృణాల్ ఇరగదీసింది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకుంది.

Also Read: Navina Bole : ప్రాజెక్ట్‌కోసం పిలిచి.. బట్టలు విప్పి చూపించమన్నాడు

ప్రజంట్ మళ్లీ హిందీలో వరుస చిత్రాలు చేస్తునే.. ఇటు తెలుగులోనూ భారీ చిత్రాల్లో స్టార్ హీరోలకు జోడీగా అవకాశాలను అందుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో మృణాల్ పేరు మారుమోగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా తనకు సంబంధించిన ఓ ఇబ్బంది కరమైన విషయాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్.. రీసెంట్‌గా క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డులను అందుకున్న సందర్భంగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఓ వేడుకకు హాజరయ్యారట.

అక్కడ మృణాల్ ఠాకూర్‌ను మీడియా పలు ప్రశ్నలు వేస్తూ ఉండగా.. అదే సమయంలో జాన్వీ కపూర్ కనిపించడంతో అందరూ ఆమెను వదిలేసి వెళ్లారంట. దాంతో మృణాల్‌కు అవమానకర సంఘటనను ఎదుర్కొందని తెలిపింది. అలాగే స్టార్ కిడ్స్‌కు ఉండే ప్రాధాన్యత సాధారణ నటీనటులకు ఉండదని తన అభిప్రాయాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం.. బాలీవుడ్ లో నెపో కిడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టు అక్కడి మీడియాల్లో వార్త వైరల్‌గా మారింది.

Exit mobile version