Site icon NTV Telugu

Mrunal Thakur : మృణాల్‌కు హిట్‌లు ఉన్నా..పట్టించుకోని టాలీవుడ్!

Mrunal

Mrunal

టాలీవుడ్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పరిస్థితి దారుణంగా మారింది. మంచి హిట్స్‌ ఇచ్చినా, ఫ్యాన్స్‌ బేస్‌ పెంచుకున్నా పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. మృణాల్ బాలీవుడ్‌లో టీవీ సీరియల్స్‌ ద్వారా పాపులర్‌ అయ్యి, ఆ తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. అయితే ఆమె కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ “సీతారామం” సినిమా. దుల్కర్ సల్మాన్‌తో నటించిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో తెలుగు ఆడియన్స్‌ ఆమెను హత్తుకున్నారు. ఆ తర్వాత నానితో చేసిన “హాయ్ నాన్న” కూడా మంచి హిట్‌ అయ్యింది. రెండు సినిమాలతోనే మృణాల్‌కి టాలీవుడ్‌లో బలమైన ఇమేజ్‌ ఏర్పడింది.

Also Read : Govinda- Sunita : నాకన్నా హీరోయిన్లతోనే ఎక్కువగా గడిపాడు.. గోవిందా భార్య షాకింగ్ కామెంట్స్!

కానీ  “ఫ్యామిలీ స్టార్” మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఆ సినిమా ఫ్లాప్‌ అవడంతో మృణాల్‌కి ఆఫర్లు కాస్త తగ్గిపోయాయి. ఇప్పుడామె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా “డెకాయిట్” . ఈ మూవీతో మృణాల్‌ మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇక మృణాల్‌ పేరుతో మరో ఆసక్తికరమైన రూమర్‌ కూడా వినిపిస్తోంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో ఓ కీలక పాత్రకు ఆమెను ఫిక్స్‌ చేశారట. కానీ ఈ వార్తకు ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు. తెలుగులో ఇలా స్లోగా ఉన్నప్పటికీ, మృణాల్‌ హిందీలో మాత్రం బిజీగా ఉంటుంది. అక్కడ చిన్నపాటి, పెద్దపాటి రోల్స్‌ ఏమైనా వచ్చినా చేయడానికి వెనుకాడదు. కానీ ఆమె ఫోకస్ మాత్రం టాలీవుడ్‌పైనే ఉందట. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగా ప్రేమించారో తెలుసని, అందుకే ఇక్కడ ఏ సినిమా వచ్చినా కాదనకుండా చేయాలని ఆమె ప్రౌండ్‌గా చెప్పిందట.

ఆడియన్స్‌ కూడా మృణాల్‌కి మళ్లీ మళ్లీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌, నటన రెండూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పుడు “డెకాయిట్” సినిమా సక్సెస్‌ అయితే మృణాల్‌కి మళ్లీ డోర్లు తెరుచుకునే అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో తమిళ సినిమాల్లో కూడా అడుగు పెట్టాలని మృణాల్‌ ప్లాన్‌ చేస్తోంది. అయితే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్లు రాలేదట. అయినా కూడా ఆమె మాత్రం ఆశలు వదులుకోలేదు. “ఏ భాష అయినా సరే, మంచి కథ వస్తే నేను తప్పక చేస్తాను” అని మృణాల్‌  తన కెరీర్‌ పట్ల నమ్మకంగా ఉంది.

Exit mobile version