Site icon NTV Telugu

Mrunal Thakur : అరుదైన ఘనత సాధించిన  మృణాల్ ఠాకూర్..

Mrunal Tagur

Mrunal Tagur

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. 2018లో ‘లవ్ సోనియా’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టి.. ఆ తర్వాత ‘తుఫాన్’, ‘ధమాక’, ‘జెర్సీ’ సినిమాల్లో నటించింది. అదే సమయంలో దుల్కర్ సల్మాన్‌తో ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. సీతా గా అందరి మనసులు దోచేసింది. తన వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది..

Also Read : Avika Gor : నేను దేన్నీ అంత ఈజీగా తీసుకోను..

సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌గా నిలిచింది మన సీత. నెట్టింట ఆమె కోసమే ఎక్కువగా మాట్లాడుకున్నారట. ఎందుకంటే ఆమెకు సంబంధించిన పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. సినిమాలతో బిజీగా ఉన్నా.. నెట్టింట ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ ను షేర్ చేస్తుంటుంది మృణాల్. హీట్ పుట్టించే ఫొటోలతో పాటు స్పైసీ క్లిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. ఆమె క్యాప్షన్ కూడా క్రేజీ ఉంటాయి. దీంతో అమ్మడు పోస్టులు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. మొత్తానికి ఆమె ఇప్పుడు నెట్టింట మోస్ట్ పాపులర్ నటి అనే అరుదైన ఘనత సాధించింది.

Exit mobile version