Site icon NTV Telugu

Mrunal Thakur : ‘డెకాయిట్’ టీమ్ ప్లాన్ అదుర్స్.. మృణాల్‌కు ఎమోషనల్ సర్‌ప్రైజ్

Mrunal Tagur

Mrunal Tagur

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తు మళ్లీ టాలీవుడ్‌ను పలకరించనున్నారు. ఆగస్టు 1న తన పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్రబృందం ఆమెకు అద్భుతమైన ప్రీ బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు తెలియకుండా తీసుకొచ్చిన కేక్‌తో సెట్స్‌లో సర్‌ప్రైజ్ వేడుక నిర్వహించగా, మృణాల్‌ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Samantha- Raj : ఒకే కారులో సమంత – రాజ్.. పిక్స్ వైరల్

ఈ సందర్భంగా తలుపు తట్టిన టీమ్ సభ్యులు “హ్యాపీ బర్త్‌డే సరస్వతి” అంటూ శుభాకాంక్షలు తెలపడంతో సినిమాలో ఆమె పాత్ర పేరు ‘సరస్వతి’ అని తెలియజేసింది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విభిన్న ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. మృణాల్‌కి ఇది కేవలం బర్త్‌డే కాదు, కెరీర్‌లో మరో గుర్తుండిపోయే మధురమైన రోజు.

 

Exit mobile version