తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మరాఠీ బ్యూటీ మృణాళ్ ఠాకూర్. ఇప్పటివరకు తెలుగులో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో నటించిన ఆమె, తొలి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరచింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్‌లో కూడా ‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Lokesh : ‘ఎల్‌సీయూ’ ఆ ఒక్క ఆలోచనతో మొదలైంది – లోకేష్ ఓపెన్ టాక్!
ఇటీవల మీడియాతో మాట్లాడిన మృణాళ్, పెళ్లి విషయంలో తన ఆలోచనలు షేర్ చేసారు. ‘నాకు పెళ్లి కావాలి, తల్లిగా మారాలనే కోరిక ఉంది. భవిష్యత్తులో భర్త, పిల్లలతో నిండిన జీవితం గురించి కలలు కంటూ ఉంటాను. కానీ ప్రతి విషయానికీ సరైన సమయం ఉంటుందనీ నమ్ముతాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్ పైనే. నటిగా ఇంకా ఎన్నో చేయాలని ఉంది. ఒకసారి కెరీర్ పరంగా సంతృప్తి పొందిన తర్వాత నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతా’ అని మృణాళ్ హాయిగా నవ్వుతూ చెప్పింది. ఆమె అందం, అభినయం, టాలెంట్‌కి మృణాళ్‌కు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో సమాంతరంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ నటికి పెళ్లిపై ఉన్న శాంతమైన దృక్పథం చాలామందిని ఇంప్రేస్ చేసింది. మొత్తంగా చెప్పాలంటే, మృణాళ్ ఠాకూర్ – కెరీర్‌కి ప్రాధాన్యం ఇస్తూ, జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్న నటిగా మరోసారి మెప్పించింది.
