మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలిజ్ అయింది మిస్టర్ బచ్చన్. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి నెగటివ్ రిజల్ట్ అందుకుంది.
Also Read : SDT18 : సుప్రీం హీరో సరసన తమిళ భామ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ నిరుత్సహ పరిచాడు బచ్చన్. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.33 కోట్లకు దక్కించుకుంది. థియేటర్ రన్ ముగించుకున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సెప్టెంబరు 12న స్ట్రీమింగ్ కు తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్. ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. రవితేజ సినిమాలకు ఓటీటీ లో మంచి డిమాండ్ ఉంది. గతంలో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు భారీ వ్యూస్ సాధించాయి. మరి థియేటర్ లో మెప్పించలేక పోయిన బచ్చన్ , తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీ లో రాబోతున్న ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.