మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ కలయికలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేసారు మేకర్స్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలిజ్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.
Also Read: Mrbachchan: మిస్టర్ బచ్చన్ సినిమాలో అదిరిపోయిన స్టార్ బాయ్ కామియో
ఈ సినిమలో అనేక మంది స్పెషల్ రోల్స్ లో కనిపించారు. వీరిలో స్టార్ బాయ్ సిద్దు బాయ్ సిద్దు జొన్నలగడ్డ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పాత్రల్లో మెరిసి ఆడియెన్స్ కి కిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలోని సీఎం పిఏ పాత్రలో ప్రముఖ వ్యక్తి కనిపించాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అని ఆరా తీయగా తెలిసిందేమంటే అయన ఎవరో కాదు నైజాం నయా డిస్ట్రిబ్యూషన్ నవాబ్, ఫైనాన్షియర్ నుండి నైజం థియేటర్ల వ్యవ్యస్థను శాసించగల మైత్రీ శశి అని తెలిసింది. మైత్రీ మూవీస్ డిస్టిబ్యూషన్ లో నైజాం లో అతి తక్కువ కాలంలో అగ్రస్థానానికి చేరుకుందంటే అందుకు ముఖ్య కారకులు మైత్రి శశి. ఇటీవల కాలంలో నైజాంలో రిలీజ్ అయిన చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు అన్ని మైత్రి శశి చేతుల మీదుగా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ పై రిలీజ్ అయ్యాయి. కాగా శశి స్పెషల్ రోల్ లో కనిపించిన మిస్టర్ బచ్చన్ కూడా నైజాంలో మైత్రీ శశి పంపిణి చేయడం గమనార్హం.