బాక్స్ ఆఫీస్ కు పండగ… దసరా వార్ లో వరుస సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ లో బాక్స్ ఆఫీస్ పండగ జరగబోతోంది. ఈ రోజు మొదలుకుని దసరా బరిలో ఫైట్ కు వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ దసరాకు బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిషన్ పరిశ్రమ తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్‌లో వార్ కోసం సిద్ధమవుతోంది. సాయి తేజ్ ‘రిపబ్లిక్’ ఈ నెలలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం. ఈ రోజు ‘రిపబ్లిక్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో పాటు ఈ మూవీ హిట్ అవ్వడానికి సాయి తేజ్ యాక్సిడెంట్ కు గురవ్వడం, ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం వంటి అంశాలు కూడా దోహదం చేయొచ్చు.
Also Read
Read Also : ‘రిపబ్లిక్’ టీంకు మెగాస్టార్ విషెస్
ఇక ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రం ‘కొండ పొలం’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహించగా, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం అప్డేట్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక దసరా వారాంతంలో భారీ సంఖ్యలో సినిమాల ఉంటుంది. శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ ‘మహాసముద్రం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 14 న విడుదలవుతుంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15న రిలీజ్ అవుతోంది.
రోషన్ ‘పెళ్లి సందడి’ కూడా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్ కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. నాగ శౌర్య నటించిన ‘వరుడు కావలెను’ సినిమా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’తో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కావచ్చు.
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!