NTV Telugu Site icon

BuchiBabu Sana : రామ్ చరణ్ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు

RC 16

RC 16

మెగా పవర్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగాభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే చరణ్ తో చేయబోయే సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌ లో ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది.

Buchi Babu Sana Emotional Speech At Baapu Pre-Release Event | Aamani | Brahmaji || NTVENT

గతరాత్రి జరిగిన బాపు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ 16 దర్శకుడు బుచ్చి బాబు సన ముఖ్య అతిధిగా విచ్చేసి RC 16 సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. బుచ్చి బాబు మాట్లాడుతూ ‘మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ‘ఉప్పెన’ సినిమా విడుదల సమయంలో ఆయన థియేటర్‌ గేట్‌ బయట సినిమా చూసి వెళ్లే వారిని ‘సినిమా బాగుందా’ అని అడిగేవారు. ఆయన కనీసం సినిమా కూడా చూడకుండా తన కొడుకు తీసిన తోలి సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అని ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం నేను రామ్‌చరణ్‌ తో చేస్తున్న సినిమా గురించి బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు నాన్న ఎందుకంటే RC 16 కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గేమ్ ఛేంజర్ తో డీలా పడిన మెగా ఫ్యాన్స్ కు బుచ్చి కామెంట్స్ మంచి బూస్ట్ నివ్వడంతో ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

Also Read : Rukmini : రష్మిక దారిలో రుక్మిణి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్