NTV Telugu Site icon

Tollywood : ఇది హీరోల పైత్యమా?… PROల పైత్యమా?

Tollywood

Tollywood

సినిమాని తియ్యడం ఒక ఆర్ట్ అయితే దానిని జనాలకు చేరువ చేసి, సినిమా పై బజ్ పెంచి రిలీజ్ చెయ్యడం మరొక ఆర్ట్. అయితే ఈ మధ్య పేరు ఉన్న సినిమాలు తీస్తున్న బ్యానర్స్ సైతం సినిమాని ప్రోమోట్ చేసే విషయంలో కిందా, మీదా అవుతున్నాయి.అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్ధం కావట్లేదు చాలామందికి.బాహుబలి,RRR లాంటి సినిమాలకు సైతం హీరోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ప్రత్యేకంగా పబ్లిసిటీ పర్పస్ కోసం వచ్చేవాళ్ళు.కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది.చిన్న హీరోలు,మీడియం రేంజ్ హీరోలు సైతం పబ్లిసిటీకి రావడానికి బద్దకంగా ఫీల్అవుతున్నారు. అయితే వాళ్ళు నిజంగా అలా ఫీల్ అవుతున్నారా? లేక వాళ్ళకి దగ్గరగా ఉండే PROలు అలా వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నారా అనేది అర్ధం కావట్లేదు.

నితిన్ విషయం తీసుకుంటే హిట్ చూసి కొన్నేళ్లు అయ్యింది.చాలా హోప్స్ తో రాబిన్ హుడ్ చేసాడు.మార్కెట్ నిలబడాలంటే హిట్ అత్యవసరం.అయినా కూడా మీడియాకి మొహం చాటేసి వాళ్ళు ఇచ్చిన PR కంటెంట్ తో మమ అనిపించాడు.ఇక్కడ PROలు ఆడుతున్న గేమ్ కూడా హాట్ టాపిక్ అవుతుంది.వాళ్ళతో మంచి సంబంధాలు,పరిచయాలు ఉన్న వాళ్లకు మాత్రమే స్పెషల్ రికమండేషన్ తో హీరోల ఇంటర్వూస్ పెట్టిస్తున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.వాళ్ళతో అంటకాగిన వాళ్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఈ ఉద్దేశపూర్వక ప్రక్రియని ఎలా చూడాలి?.పైగా ఈ విషయంలో నిర్ణయం ప్రొడక్షన్ హౌస్ ది అంటూ,హీరోలది అంటూ వాళ్ళను కూడా బద్నాం చేస్తున్నారు.ఓవరాల్ ఇది హీరోల పైత్యమా? లేక PRO పైత్యమా అనే కన్ఫ్యూషన్ మాత్రం కొనసాగుతుంది.మరి టాలీవుడ్ లో ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో.